భారత టెన్నిస్ లెజెండ్ అక్తర్ ఆలీ కన్నుమూత... నివాళులు అర్పించిన క్రీడాలోకం...
ఎనిమిది డేవిస్ కప్‌ల్లో ప్రాతినిథ్యం వహించిన అక్తర్ ఆలీ...
భారత టెన్నిస్ జట్టుకి కోచ్‌గా వ్యవహారించిన అక్తర్...
87 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూత...
భారత టెన్నిస్ లెజెండ్ అక్తర్ ఆలీ తుదిశ్వాస విడిచారు. 1958 నుంచి 1964 వరకూ ఎనిమిది డేవిస్ కప్‌ల్లో భారత్‌కి ప్రాతినిథ్యం వహించిన అక్తర్ ఆలీ, భారత టెన్నిస్ జట్టుకి కోచ్‌గా కూడా వ్యవహారించారు. 83 ఏళ్ల అక్తర్ ఆలీ కొన్నాళ్లుగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఆయనకు క్యాన్సర్ చివరి దశకు చేరినట్టు కూడా వైద్యులు గుర్తించారు. రెండు వారాల కిందట కోల్‌కత్తాలోని ఓ ఆసుపత్రిలో చేరిన అక్తర్ ఆలీ... అక్కడ చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ సేస్‌తో పాటు ఎందరో ప్రతిభావంతులైన టెన్నిస్ ప్లేయర్లకు శిక్షణ ఇచ్చిన అక్తర్ ఆలీ... వాలీబాల్ తరహాలో టెన్నిస్ బంతిని ఎదుర్కోవడం శిక్షణ ఇస్తారు.
విజయ్ అమృత్‌రాజ్, రమేశ్ కృష్ణన్ వంటి కోచ్‌లు కూడా అక్తర్ ఆలీ ట్రైనింగ్ స్టైల్ నుంచి ప్రేరణ పొందినవాళ్లే. భారత టెన్నిస్ ప్లేయర్లు విజయ్ అమృత్‌రాజ్, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌తో పాటు భారత మాజీ క్రీడాశాఖ మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ కూడా అక్తర్ ఆలీకి నివాళులు ఘటించారు.