టెన్నిస్ స్టార్ షరపోవా మీద ఢిల్లీలో కేసు.. వాళ్లతో కలిసి కుట్ర చేసి మోసం చేశారంటూ కేసు పెట్టిన మహిళ

Maria Sharapova: టెన్నిస్ లో మాజీ ప్రపంచ ఛాంపియన్ మారియా షరపోవాపై ఢిల్లీకి సమీపంలో ఉన్న గుర్గావ్ లో  కేసు నమోదైంది. ఆమెతో పాటు మాజీ ఫార్ములా వన్ రేసర్ మైఖేల్ షుమేకర్ తమను మోసం చేశారంటూ ఓ మహిళ... 

Gurgaon Police Filed a case Against Tennis Star Maria Sharapova and Michael Schumacher, here is the Reason

ప్రముఖ టెన్నిస్ స్టార్, మాజీ వరల్డ్ నెంబర్ వన్ మరియా షరపోవా మీద  దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండే  గుర్గావ్ లో కేసు నమోదైంది. షరపోవాతో పాటు  మాజీ ఫార్ములా వన్ రేసర్ మైఖేల్ షుమేకర్, మరో 11 మంది మీద కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు.  ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా   గుర్గావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో కలిసి  వీళ్లంతా కుట్ర చేశారని ఫిర్యాదులో సదరు మహిళ ఆరోపించింది. 

వివరాల్లోకెళ్తే.. న్యూఢిల్లీలోని ఛత్తర్పూర్ మినీ ఫామ్ లో నివాసం ఉంటున్న షఫాలీ అగర్వాల్ పైన పేర్కొన్న సెలబ్రిటీల మీద  ఫిర్యాదు చేసింది. M/S రియల్‌టెక్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ... షరపోవా, షుమేఖర్ లను ప్రమోటర్ లుగా నియమించుకుని  కొనుగోలుదారులను మోసం చేశారని ఫిర్యాదుదారు ప్రధాన ఆరోపణగా ఉంది. 

పోలీసుల వివరాల ప్రకారం..  M/S రియల్‌టెక్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ షరపోవా, షుమేఖర్ లను ప్రమోటర్లుగా నియమించుకుంది.  తాము కొత్గగా కడుతున్న వెంచర్ లో ఓ ప్రాజెక్టుకు షరపోవా పేరును మరో టవర్ కు షుమేకర్ పేరును పెట్టింది. ఈ ప్రాజెక్టులో అపార్ట్మెంట్ లను బుక్ చేసుకోవాలంటూ భారీగా ప్రకటనలిచ్చింది. షరపోవా, షుమేకర్ లతో విరివిగా ప్రచారం కల్పించింది.  సెలబ్రిటీలను చూసిన పలువురు అందులో  అపార్ట్మెంట్ బుుక్ చేసుకున్నారు. అలా చేసుకున్నవారిలో షఫాలీ కూడా ఉంది. రూ. 80 లక్షలు ఆమె షరపోవా  టవర్ లో పెట్టుబడి పెట్టింది. అయితే ఏండ్లు గడుస్తున్న ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు.  దీంతో సదరు సంస్థ ప్రతినిధులతో విసిగిపోయిన షఫాలీ పోలీసులను ఆశ్రయించింది. 

 

గుర్గావ్ సెక్టార్ 73లో షరపోవా  ప్రాజెక్టు తాను, తన భర్త కలిసి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నామని, అయితే డెవలపర్లు మాత్రం తమ ప్రాజెక్టులో డబ్బు పెట్టమని  ప్రలోభపెట్టారని,  లేకుంటే తాము బుక్ చేసుకున్న  ఫ్లాట్ కూడా డెలివరీ చేయమని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది.  ఈ సందర్భంగా షఫాలీ మాట్లాడుతూ.. ‘మేము ప్రాజెక్టు గురించి ప్రకటనల ద్వారా తెలుసుకున్నాం. అందులో చాలా తప్పుడు వాగ్దానాలు చేశారు. షరపోవా సైట్ ను  సందర్శించినప్పుడు.. ఇక్కడ టెన్నిస్ అకాడమీ ప్రారంభిస్తామని, స్పోర్ట్స్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు అందులో ఏ ఒక్కటీ  నెరవేరలేదు. షరపోవా ప్రాజెక్టును ప్రమోట్ చేస్తున్న బ్రోచర్ లో ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి.  డెవలపర్లతో కలిసి షరపోవా, షుమేకర్ లు కూడా కుట్ర చేశారు..’ అని ఆమె వాపోయారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios