Asianet News TeluguAsianet News Telugu

French Open: మట్టి కోర్టులో మహా సంగ్రామం.. 222 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం.. తెలుగుతో పాటు 3 భాషల్లోనూ లైవ్..

French Open 2022: టెన్నిస్ ప్రపంచంలో అత్యంత  ప్రతిష్టాత్మకమైన టోర్నీగా గుర్తింపు పొందిన ఫ్రెంచ్ ఓపెన్  నేటి నుంచే ప్రారంభం కానుంది. జనవరి లో ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత ఈ ఏడాది జరిగే రెండో గ్రాండ్ స్లామ్ ఇది. 

French Open to be Broadcasted Live in 222 Countries, Breaks All Records
Author
India, First Published May 22, 2022, 3:56 PM IST

మట్టికోర్టు (ఫ్రెంచ్ ఓపెన్ కు మరో పేరు)లో  హోరా హోరిగా తలపడటానికి ప్రపంచ  దిగ్గజ ఆటగాళ్లు.. రాబోయే తరంలో టెన్నిస్ ప్రపంచాన్ని ఏలబోయే క్రీడాకారులు సిద్ధమయ్యారు. ఫ్రాన్స్ వేదికగా ఆదివారం  రాత్రి (భారత కాలమానం ప్రకారం) నుంచి ప్రారంభం కాబోయే మట్టికోర్టు మహా సంగ్రామానికి సర్వంం సిద్ధమైంది. మునుపెన్నడూ లేనంతగా ఈ మెగా ఈవెంట్ ను ఏకంగా 222 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుండటం విశేషం. ఈ టోర్నీ ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్ లో  ఫ్రాన్స్ టెలివిజన్ దీనికి అధికారిక ప్రసారదారు కాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఈవెంట్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీని ఏకంగా 222 దేశాల్లోని 170 నెట్వర్క్స్ లలో (భారత్ లో జరుగుతున్న ఐపీఎల్ 125 దేశాలలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నది) లైవ్ కవరేజీ చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత్ లో ఇది సోనీ  స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నది.  తొలిసారిగా ఈ టోర్నీని భారత్ లోని నాలుగు భాషల్లో అందివ్వనుండటం విశేషం. 

రొలాండ్ గారోస్ గా ప్రసిద్ధికెక్కిన ఈ టోర్నీని జగమంతా వీక్షించడానికి వీలుగా..  అన్ని హంగులతో కూడిన లైవ్ కవరేజీలను ఏర్పాటు చేసినట్టు  ప్రసార హక్కులు పొందిన ఛానెళ్లు తెలిపాయి. యూరప్ దేశాలతో పాటు అమెరికా, రష్యా, బ్రెజిల్, ఆస్ట్రేలియాలలో టెన్నిస్ ను అధికంగా ఇష్టపడతారు. 

 

భారత్ లో ఇలా.. 

ఇండియలో ఫ్రెంచ్ ఓపెన్ లైవ్ మ్యాచులను సోనీ స్పోర్ట్స్ లో వీక్షించొచ్చు.. భారత్ లో ఇంగ్లీష్, హిందీలతో పాటు తమిళ్, తెలుగులలో కూడా  మ్యాచులను చూడొచ్చు. సోనీ సిక్స్, సోనీ టెన్ 2 లలో ఇంగ్లీష్ లో ప్రసారం కానుండగా సోనీ టెన్ 3 లో హిందీలో అవుతాయి. ఇక సోనీ టెన్ 4 లో తమిళ్, తెలుగులలో ఫ్రెంచ్ ఓపెన్ మజాను ఆస్వాదించవచ్చు.  

ప్రసారాలకు ఫుల్ డిమాండ్.. 

ఇతర దేశాలంత కాకపోయినా భారత్ లో కూడా టెన్నిస్ ను చూసే  ప్రేక్షకుల సంఖ్య అధికమే. ఈ నేపథ్యంలో అడ్వర్టైజింగ్ సంస్థలు కూడా సోనీ స్పోర్ట్స్ తో  ఒప్పందం కుదుర్చుకున్నాయి.  9 సంస్థలు (హ్యుందాయ్, అముల్, రొలెక్స్, అప్పీల్, 1ఎక్స్ న్యూస్, టార్గెట్ వన్, ఫెయిర్ ప్లే న్యూస్, లొటొలాండ్ డఫ న్యూస్)  భారత్ లో ఫ్రెంచ్ ఓపెన్ ప్రసారాలకు స్పాన్సర్స్ గా వ్యవహరిస్తాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios