స్పానిష్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ ఖాతాలో మరో ఫ్రెంచ్ ఓపెన్ చేరింది. మట్టి కోర్టులో చెలరేగిపోయే రఫెల్ నాదల్ జోరు ముందు సెర్భియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ నిలవలేకపోయాడు. కెరీర్‌లో 20వ గ్రాండ్ స్లామ్ గెలిచిన రఫెల్ నాదల్‌కి, ఇది 13వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. కెరీర్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన టెన్నిస్ ప్లేయర్‌గా రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు రఫెల్ నాదల్. 

నోవాక్ జొకోవిచ్‌కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా 0-6 తేడాతో మొదటి సెట్ గెలుచుకున్న రఫెల్ నాదల్, 6-2, 5-7 తేడాతో వరుసగా మూడు సెట్లు గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ 2020 టైటిల్ కైవసం చేసుకున్నాడు. 2005 నుంచి వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ గెలుస్తూ వస్తున్న రఫెల్ నాదల్, ఒక్క 2015, 2016 సంవత్సరాల్లో మాత్రమే టైటిల్ గెలవలేకపోయాడు.