తెలంగాణకు గొప్ప గౌరవం దక్కింది. తెలంగాణకు చెందిన నలుగురు యువతులు... భారత టెన్నిస్ జట్టుకి ఎంపికయ్యారు. ఇటీవల దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత టెన్నిస్ జట్లను ప్రకటించారు. మహిళల జట్టులో ఏకంగా నలుగురు అమ్మాయిలు చోటు దక్కించుకోవడం అందరి దృష్టి సారించింది. 

తెలంగాణకు చెందిన జాతీయ ఛాంపియన్ సౌజన్య భవిశెట్టి, కాల్వ భువన, సామ సాత్విక, చిలకలపూడి శ్రావ్య శివానీలకు జాతీయ జట్టులో స్థానం దక్కింది. ఈ నలుగురితోపాటు ప్రేరణ బాంబ్రీ(ఢిల్లీ), ప్రార్థన తొంబారే( మహారాష్ట్ర) కూడా భారత జట్టులోకి ఎంపికయ్యారు. పురుషుల జట్టులో సాకేత్ మైనేని, నిక్కీ పునాచా( ఆంధ్రప్రదేశ్), విష్ణేవర్ధన్( తెలంగాణ), మనీశ్ సురేష్ కుమార్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెడుంజెళియన్( తమిళనాడు) భారత్ కు ప్రాతినధ్యం వహిస్తారు.

జాతీయ మాజీ ఛాంపియన్ అశుతోష్ సింగ్ భారత పురుషుల, మహిళల జట్లకు కోచ్ కమ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దక్షిణాసియా క్రీడలు డిసెంబర్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నేపాల్ లో జరగనున్నాయి.