Ash Barty: టెన్నిస్ ప్రపంచానికి షాకిచ్చిన వరల్డ్ నెంబర్ వన్ యాష్లే బార్టీ.. 25 ఏండ్లకే ఆటకు వీడ్కోలు..

Ashleigh Barty Retirement: టెన్నిస్ ప్రపంచానికి షాకిస్తూ ప్రపంచ మహిళల నెంబర్ వన్ క్రీడాకారిణి యాష్లే బార్టీ  కెరీర్ కు ముగింపు చెప్పింది. 25 ఏండ్ల వయసులోనే ఆమె టెన్నిస్ కు రిటైర్మెంట్ చెప్పడంపై ఆమె అభిమానులతో పాటు యావత్ టెన్నిస్ ప్రపంచం కూడా షాక్ కు గురైంది. 

Big Shock To Tennis World, World No.1 Player Ashleigh Barty Retired From Game at The Age of 25

మహిళల టెన్నిస్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు ఉన్న  యాష్లే బార్టీ  యావత్ టెన్నిస్ ప్రపంచానికి షాకిచ్చింది.  ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆమె ప్రకటించింది. యాష్లే తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో టెన్నిస్  అభిమానులతో పాటు క్రీడాకారులు కూడా  ఆశ్చర్యానికి గురయ్యారు.  25 ఏండ్లకే అదీ కెరీర్ పీక్స్ లో ఉండగా  బార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలుచుకున్న ఆమె.. కొద్దికాలానికే ఆట నుంచి వీడ్కోలు పలుకుతున్నట్టు సోషల్ మీడియాలో సంచలన ప్రకటల చేసింది. 

25 ఏండ్ల బార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఇలాంటి కఠిన నిర్ణయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. టెన్నిస్ కు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నా. అయితే  ఆట నుంచి రిటైర్ అవుతున్నందుకు నేనేమీ బాధపడటం లేదు. సంతోషంగానే ఉన్నా.  అంతేగాక దేనికైనా  సిద్ధమే. ఆట కోసం నా వంతు కృషి చేశాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 

నా వరకైతే కెరీర్ ను విజయవంతంగానే ముగించానని అనుకుంటున్నాను.  ఈ సందర్భంగా నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు.  రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని అనుకుంటున్నా...’ అని తెలిపింది.  టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆమె తనకున్న ఇతర కలలను నెరవేర్చుకోవడంపై దృష్టి సారిస్తానని తెలిపింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ash Barty (@ashbarty)

టెన్నిస్ తో పాటు క్రికెట్ అంటే కూడా బార్టీకి ఇష్టమే.  గతంలో బిగ్ బాష్ లీగ్  (మహిళల) లో కూడా ఆమె కొన్ని మ్యాచులు ఆడింది.  టెన్నిస్ కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఆమె  చూపు క్రికెట్ వైపు పడుతుందా..? అని ఆమె అభిమానులు భావిస్తున్నారు. 

కాగా..  ప్రపంచ టెన్నిస్ చరిత్రలో  అత్యధిక కాలం (మహిళల విభాగంలో) నెంబర్ వన్ గా ఉన్న నాలుగో క్రీడాకారిణి గా  బార్టీ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 121 వారాలుగా టెన్నిస్ లో ఆమె నెంబర్ వన్ గా ఉంది. స్టెఫీ గ్రాఫ్ (186 వారాలు), సెరెనా విలియమ్స్ (186 వారాలు), మార్టినా నవ్రతిలోవా (156 వారాలు) లు బార్టీ కంటే ముందున్నారు. 

 

యాష్లే బార్టీ కెరీర్ విషయానికొస్తే..   2010 లో ఆస్ట్రేలియా ఓపెన్ ద్వారా కెరీర్ ఆరంభించింది.  2014 వరకు  టెన్నిస్ ఆడిన ఆమె అనూహ్యంగా ఆ ఏడాది తర్వాత క్రికెట్ బ్యాట్ పట్టింది.  ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సబర్బ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్ తరఫున క్రికెట్ కూడా ఆడింది.  2015లో బ్రిస్బేన్ లో నిర్వహించిన ఉమెన్స్  క్రికెట్ లీగ్ లో  ఆడింది.   వెస్టర్న్ సబర్బ్ తరఫున ఆమె 13 మ్యాచులాడింది. ఇక 2016లో మళ్లీ టెన్నిస్ బ్యాట్ పట్టింది బార్టీ.. 2018లో యూఎస్ ఓపెన్ డబుల్ ఛాంపియన్స్ గా నిలిచిన ఆమె.. 2019లో  ఫ్రెంచ్ ఓపెన్ లో దుమ్ము దులిపింది. ఆ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకుని  మహిళల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచింది.  2021లో వింబుల్డన్  ను కూడా గెలుచుకుంది.    

ఇక ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ లో కూడా విజయం సాధించి 44 ఏండ్ల తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఓపెన్ లో గ్రాండ్ స్లామ్  సాధించిన రెండ మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios