చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న.. కెరీర్‌లో తొలి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ కైవసం
భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆయన తన కెరీర్‌లో తొలి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన పార్ట్‌నర్ మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి కైవసం చేసుకున్నాడు.
భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆయన తన కెరీర్‌లో తొలి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన పార్ట్‌నర్ మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇటలీకి చెందిన సిమోన్ బోలెల్లి , ఆండ్రియా వాస్సోరిపై 7-6, 7-5 వరుస సెట్లలో విజయం సాధించాడు. తద్వారా గ్రాండ్ స్లామ్ గెలిచిన పెద్ద వయస్కుడిగా బోపన్న చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న మూడో భారతీయుడిగానూ రోహన్ రికార్డుల్లోకెక్కాడు.
శనివారం నాటి విజయానికి ముందువరకు.. బోపన్న ఒక్క గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లోనూ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలవలేదు. అంతకుముందు రెండుసార్లు యూఎస్ ఓపెన్‌లో (2013, 2023)లలో ఫైనల్ వరకు వెళ్లాడు. 2017 ఫ్రెంచ్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న విజయం సాధించాడు. ఫైనల్‌కు చేరుకోవడానికి ముందు.. బోపన్న, అతని ఆస్ట్రేలియన్ పార్ట్‌నర్ ఎబ్డెన్‌లు గురువారం కేవలం రెండు గంటల పాటు జరిగిన గేమ్‌లో 6-3, 3-6, 7-6 తేడాతో చైనాకు చెందిన జాంగ్ జిజెన్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన టోమస్ మచాక్‌లను ఓడించాడు.
43 ఏళ్ల వయసులో బోపన్న.. పురుషుల టెన్నిస్‌లో అత్యంత పెద్ద వయస్కుడైన గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచాడు. తద్వారా 2022లో మార్సెలో అరెవోలాతో కలిసి 40 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ట్రోఫీని గెలుచుకున్న జీన్ జూలియన్ రోజర్ రికార్డును బద్ధలుకొట్టారు.