Czech Republic's pair Won Women's Doubles Crown: కెరీర్ లో ఇప్పటికే మూడు గ్రాండ్ స్లామ్ లు గెలిచిన  సినికోవా-క్రెజికోవాకు ఇదే తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్.  2021 ఆస్ట్రేలియా ఫైనల్లో ఈ జోడి తుది పోరులో ఓడింది. 

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో చెక్ రిపబ్లిక్ జోడీ బార్బోరా క్రెజికోవా, కత్రినా సినికోవాలు సంచలనం సృష్టించారు. ఆస్ట్రేలియా ఓపెన్-2022 మహిళల డబుల్స్ ఫైనల్స్ లో భాగంగా ఆదివారం ముగిసిన తుదిపోరులో క్రెజికోవా-సినికోవాల జోడి 6-7(3), 6-4, 6-4 తేడాతో అన్నా డానిలీని (బ్రెజిల్), బేట్రిజ్ హద్దాద్ మయ్యా (కజకిస్థాన్) లపై విజయం సాధించింది. రెండు గంటల 42 నిమిషాల పాటు జరిగిన ఈ ఫైనల్ లో గెలవడం ద్వారా చెక్ జంట తమ కెరీర్ లో నాలుగు గ్రాండ్ స్లామ్ లు గెలుచుకున్నారు. 

ఇక ఈ గేమ్ లో కజకిస్థాన్ జోడీ.. సినికోవా-క్రెజికోవాకు గట్టి పోటీనిచ్చారు. తొలి సెట్ తో పాటు మూడు సెట్లలోనూ ఈ జంట హోరాహోరీగా పోరాడింది. అయితే పట్టుదల కోల్పోకుండా ఆడిన చెక్ జోడినే విజయం వరించింది. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. కెరీర్ లో ఇప్పటికే మూడు గ్రాండ్ స్లామ్ లు గెలిచిన సినికోవా-క్రెజికోవాకు ఇదే తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్. 2021 ఆస్ట్రేలియా ఫైనల్లో ఈ జోడి ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం) -అరైనా సబలెంక (బెలారస్) చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. కానీ ఈసారి ఏకంగా ఫైనల్ నెగ్గి తమ కలను నెరవేర్చుకుంది. 

గతంలో రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ (2018, 2021) నెగ్గిన ఈ జోడి.. 2018 ఆస్ట్రేలియా ఓపెన్ లో పెద్దగా ఆకట్టుకోలేదు. 2019లో క్వార్టర్స్ కు చేరారు. 2021 లో ఫైనల్ లో తడబడ్డారు. కానీ ఈసారి పట్టుదలగా ఆడి టైటిల్ నెగ్గడం విశేషం. గతేడాది ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కూడా క్రెజికోవా-సినికోవా ల జంట ఉమెన్స్ డబుల్స్ లో స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే.

Scroll to load tweet…

ఇక పురుషుల డబుల్స్‌ ఫైనల్లో థనాసి కొకినాకిస్‌-నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా) జంట.. అదే దేశానికి చెందిన 7–5, 6–4తో ఎబ్డెన్‌–పర్సెల్‌ పై గెలిచింది. తద్వారా తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించింది. ‘వైల్డ్‌ కార్డు’ ఎంట్రీ ద్వారా బరిలోకి దిగి డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన జోడీగా కొకినాకిస్-నిక్ కొరియాస్ జంట చరిత్ర సృష్టించింది.