ఆస్ట్రేలియా ఓపెన్ 2021పై కరోనా దెబ్బ... హోటెల్ సిబ్బందికి పాజిటివ్ రావడంతో 600 మంది ప్లేయర్లను...
ఫిబ్రవరి 8 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ 2021...
హోటెల్ సిబ్బందికి కరోనా పాజిటివ్...
హోటల్‌లో ఉన్న 600 మంది ప్లేయర్లు మొత్తం క్వారంటైన్‌లోకి...
టీమిండియా నుంచి రవి బోపన్న,సుమిత్ నగాల్...
దాదాపు ఆరు నెలల పాటు క్రీడా ప్రపంచాన్ని స్థంభింపచేసిన కరోనా వైరస్... ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. కరోనా వైరస్ కారణంగా 87 ఏళ్లలో తొలిసారి రంజీ ట్రోఫీని రద్దు చేయగా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన టెస్టు సిరీస్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ 2021పై కూడా కరోనా తన ఎఫెక్ట్‌ను చూపించింది...
మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ఓపెన్ 2021 కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్లేయర్ల కోసం బయో బబుల్ జోన్ ఏర్పాటు చేసి గ్రాండ్ హయత్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. అయితే హోటల్‌లో పనిచేసే ఓ వ్యక్తికి బుధవారం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో హోటల్‌లో ఉన్న 600 మంది ప్లేయర్లు మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లారు.
ప్లేయర్లతో పాటు ఆస్ట్రేలియా ఓపెన్ 2021 సహాయక సిబ్బంది, అధికారులు కూడా క్వారంటైన్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 8 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్, ఫిబ్రవరి 21న ముగుస్తుంది. వీరిందరికీ కరోనా టెస్టులు ముగిసి, నెగిటివ్ వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణ గురించి క్లారిటీ వస్తుంది.
రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ గాయాల కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్ 2021 సీజన్‌కి దూరమవుతున్నట్టు ప్రకటించారు. టీమిండియా నుంచి రవి బోపన్న,సుమిత్ నగాల్, రామ్‌కుమార్, దివిజ్ శరణ్ ఆస్ట్రేలియా ఓపెన్ 2021 బరిలో దిగనున్నారు.