ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియామీర్జా సోదరి ఆనం మీర్జా పెళ్లి సందడి మొదలైంది. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఆనం మీర్జాకి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.  అసద్, ఆనం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో... వారు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఈ వారం వీరి పెళ్లి జరగనుంది. కాగా... అప్పటి నుంచే ఆనం మీర్జా చాలా అందంగా ముస్తాబైంది.

వధువు తెలుపు, గులాబీ రంగు టాప్ స్కర్టుతో పూలతో తయారు చేసి బ్యాండ్ ని తలకు అంకరించుకుంది. దీంతో... ఆమె మరింత అందంగా కనిపించింది. ఎర్రరంగు దుస్తులు ధరించిన సానియా మీర్జా వధువు అయిన తన సోదరి ఆనంమీర్జాతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ సోదరి పెళ్లి వేడుక గురించి ప్రస్థావించారు.

 స్టైలిస్ట్ అయిన ఆనంమీర్జా న్యాయవాది అయిన అసద్ ను వివాహమాడనుంది. ఆనంమీర్జా కూడా తన ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘మంచి స్నేహితులైన కుటుంబసభ్యులను పొందుతుండటం నాకెంతో థ్రిల్‌గా, ఆనందంగా ఉంది’’ అని ఆనంమీర్జా వ్యాఖ్యానించారు. అజారుద్దీన్ కుమారుడు అసద్ తో తన చెల్లెలు ఆనంమీర్జా పెళ్లి అని సానియా మీర్జా అక్టోబరు నెలలో ప్రకటించారు.ఈ పెళ్లితో రెండు క్రీడా కుటుంబాలైన అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబాలు బంధువులు కానున్నారు.