హంబర్గ్: ఈ ఏడాది యూఎస్ ఓపెన్ లో అదరగొట్టి రన్నరప్ నిలిచిన జర్మనీ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెన్ అందరికీ గుర్తుండే వుంటాడు. తాజాగా అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. కేవలం 23ఏళ్ల వయసులో యూఎస్ ఓపెన్ అదరగొట్టగా అదే వయసులో ఇప్పుడు ఓ యువతిని గర్భవతిని చేశాడు. ఈ  విషయాన్ని స్వయంగా అతడి ప్రియురాలే బయటపెట్టింది. 

తనకంటే వయసులో పెద్దదయిన బ్రెండా(27ఏళ్లు)తో జ్వెరేన్ కొంతకాలం సమజీవనం చేశాడు. అయితే ఇద్దరి అభిప్రాయాలు కుదరకపోవడంతో ఈ ఏడాది ఆగస్ట్ లోనే విడిపోయారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బ్రెండా తానిప్పుడు 20వారాల గర్భవతినని... జ్వేరెవ్ కారణంగానే గర్భం దాల్చినట్లు వెల్లడించింది. 

''తామిద్దరి అభిప్రాయాలు కుదరకపోవడం వల్లే విడిపోయాం. అయితే అతడి వల్ల బిడ్డకు జన్మనిస్తున్నా బిడ్డను చూసుకునే బాధ్యతను నేనే చూసుకుంటా. ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను అతడి వద్ద వుంచను'' అని బ్రెండా పేర్కొంది.