Asianet News TeluguAsianet News Telugu

జహిరాబాద్ లో త్రిముఖ పోరు...అనూహ్యంగా పోటీలోకి బిజెపి

జహిరాబాద్...సంగారెడ్డి జిల్లాలో విశిష్ట సంస్కృతి, విభిన్న మతాలకు నిలయం.  పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతాల్లో ఇదీ ఒకటి. ఇక తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో రాష్ట్రంలో ఎక్కడా లేని భిన్నత్వం ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువే. దీంతో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. 
 

zaheerabad assembly constituency election
Author
Zaheerabad, First Published Nov 27, 2018, 7:55 PM IST

జహిరాబాద్...సంగారెడ్డి జిల్లాలో విశిష్ట సంస్కృతి, విభిన్న మతాలకు నిలయం.  పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతాల్లో ఇదీ ఒకటి. ఇక తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో రాష్ట్రంలో ఎక్కడా లేని భిన్నత్వం ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువే. దీంతో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. 

జహిరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు మంచి పట్టుండేది. ఇక్కడి నుండి కొన్ని దశాబ్దాల పాటు మాజీ మంత్రి బాగారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుండే ఎన్నికై రాష్ట్ర, కేంద్ర స్థాయిలో మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలోనే ఆయన జహిరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. ఓటమంటూ ఎరుగకుండా దూసుకుపోతున్న బాగారెడ్డికి మొదటిసారి బిజెపి పార్టీ కళ్లెం వేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ ఎంపీగా  పోటీ చేసిన బాగారెడ్డి బిజెపి అభ్యర్థి ఆలె నరేంద్ర చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో బాగారెడ్డి పూర్తిగా రాజకీయాల్లోంచి తప్పుకున్నారు. ఈ ఎన్నికల ప్రభావంతో జహిరాబాద్ లో కాంగ్రెస్ హవా చాలా వరకు తగ్గింది. 

ఆ తర్వాత బిజెపి పార్టీ నియోజకవర్గ పరిధిలో క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో అక్కడి రాజకీయాల ప్రభావం
జహీరాబాద్ పై పడింది. అందువల్ల మెదక్ ఎంపీగా బిజెపి గెలపుకు జహిరాబాద్ ముఖ్యపాత్ర పోషించింది. అంతేకాకుండా లింగాయత్ సామాజికవర్గం ప్రభావం ఇక్కడ ఎక్కువగా వుండటం...వారు ముఖ్యంగా హిందుత్వ భావజాలాన్ని కల్గివుండటం  కూడా బిజెపి గెలుపుకు కారుణం. అయితే నరేంద్ర పార్టీని వీడటంతో సరైన నాయకత్వ లేమి కారణంగా మళ్లీ బిజెపి క్యాడర్ మొత్తం వివిధ పార్టీల్లో కలిసిపోయారు.  

అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో జహిరాబాద్ లో హోరాహోరీ పోటి తప్పేలా లేదు. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు గతం నుండి బలోపేతంగా వుండగా తాజాగా బిజెపి పార్టీ కూడా పోటీలోకి వచ్చింది. ఈ  స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో మాజీ మంత్రి గీతా రెడ్డి  కాంగ్రెస్ తరపున పోటీచేసి గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.  అయితే తాజాగా నియోజకవర్గ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 

బిజెపి తరపున భారీ పారిశ్రామిక వేత్త జంగం గోపి, టీఆర్ఎస్ నుండి మాణిక్ రావు మాజీ మంత్రిపై పోటీ చేస్తున్నారు. అయితే ఇటీవలే బిజెపిలో చేరిన గోపి ప్రచారంలో దూకుడు పెంచడంతో నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అసలు ఫోటీలోనే వుండదనుకున్న బిజెపి అనూహ్యంగా పుంజుకుని ఇప్పుడు  నువ్వా నేనా అన్నట్లు పోటీనిస్తోంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు,ఎబివిపి వంటి బిజెపి అనుబంధ సంస్థల కార్యకర్తలతో పాటు యువత అండతో అభ్యర్థి గోపి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు బిజెపి నాయకులు చెబుతున్నారు. 

ఇక టీఆర్ఎస్ పరిస్థితి కాస్త భిన్నంగా వుంది. గత ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి గీతారెడ్డి చేతిలో అతితక్కువ ఓట్ల తేడాతో ఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు ఓడిపోయారు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం ఈసారి అభ్యర్థిని మార్చనున్నట్లు ప్రచారం జరిగింది. చివరకు మాణిక్ రావుకే మళ్లీ అవకాశం లభించినప్పటికి అభ్యర్థి ఎంపిక ఆలస్యం కావడంతో తీవ్ర నష్టం జరిగింది. 

ఇప్పటివరకు మాజీ మంత్రి గీతారెడ్డి ఒక్కరే జహిరాబాద్ కు పెద్దదిక్కుగా వున్నారు. అయితే ఆమె స్థానికేతర నాయకురాలు కావడం, కేవలం ఎన్నికల సమయంలోనే  నియోజకవర్గంలో కనిపిస్తారని ప్రచారం వుండటంతో ప్రస్తుత  ఎన్నికల్లో త్రిముఖ పోరు అనివార్యమైంది.  బిజెపి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడంతో జహిరాబాద్
ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios