ఎవ‌రి పేరుమీదా రిజిస్టర్ కాని 'శ్రీ' పేరిట ఉన్న లక్షల ఎకరాలను మింగేందుకే కేసీఆర్ ధరణిని తీసుకొచ్చార‌ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ఆరోపించారు. పేదల భూములను లాక్కొని దొరలకు కట్టబెట్టేందుకే ధరణిని ఏర్పాటు చేశారు తప్ప భూరికార్డుల ప్రక్షాళనకోసం కాదని ఆమె విమర్శించారు.

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఓన‌ర్‌షిప్ విష‌యంలో క్లారిటీలేని 3 ల‌క్ష‌ల ఎక‌రాల భూములు శ్రీ అనే పేరిట ఉన్నాయ‌ని ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఎవ‌రి పేరుమీదా రిజిస్టర్ కాని 'శ్రీ' పేరిట ఉన్న లక్షల ఎకరాలను మింగేందుకే కేసీఆర్ ధరణిని తీసుకొచ్చార‌ని ష‌ర్మిల ఆరోపించారు. పేదల భూములను లాక్కొని దొరలకు కట్టబెట్టేందుకే ధరణిని ఏర్పాటు చేశారు తప్ప భూరికార్డుల ప్రక్షాళనకోసం కాదని ఆమె విమర్శించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

'భూములు ఉన్నోళ్లకు లేనట్టు.. లేనోళ్లకు ఉన్నట్టు.. తప్పుల తడకగా తయారైంది ధరణి. దానికి తోడు అధికార్ల చేతివాటంతో బతికున్నోళ్లను చంపేసి ఇతరులకు పట్టాలు కట్టబెడుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో నా భూమిని నాకు ఇప్పించండని .. నా పేరున పట్టా చేయాలని ఏండ్ల తరబడి తిరిగి చివరకు ఎమ్మార్వో ఆఫీసుకు తాళిబొట్టు కట్టింది ఓ మహిళ. ఇది దొరగారు తెచ్చిపెట్టిన ధరణి కష్టాలు' అంటూ ష‌ర్మిల మండిపడ్డారు

Scroll to load tweet…