హైదరాబాద్:  వైఎస్ షర్మిల ఈ నెల 11వ తేదీన రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పర్యటిస్తారు. వచ్చే నెల 8వ తేదీన షర్మిల వైఎస్ఆర్‌టీపీ ని ప్రారంభించనున్నారు. పార్టీ ప్రారంభించడానికి ముందు వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల  సమావేశం అయ్యారు. 

రాష్ట్రంలో రైతుల పరిస్థితిని తెలుసుకొనేందుకు షర్మిల పర్యటించనున్నారు.   ఐకేపీ సెంటర్లలో ధాన్యాన్ని ఆమె పరిశీలిస్తారు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు తీరుతెన్నులను  ఆమె పరిశీలిస్తారు.  గత మాసంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకొన్న నిరుద్యోగి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.  తెలంగాణలో ప్రజల సమస్యలపై పనిచేయాలని  షర్మిల భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆమె తలపెట్టింది.  ఇందులో భాగంగానే  ఆమె రంగారెడ్డి జిల్లాలో టూర్ ను ఎంచుకొంది. 

పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు షర్మిల     అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజల ఎజెండాయే తమ పార్టీ ఎజెండాగా ఉంటుందని షర్మిల ప్రకటించింది. వైఎస్ఆర్ జయంతి రోజున పార్టీని ప్రకటించనున్నట్టుగా  షర్మిల తెలిపింది.