Asianet News TeluguAsianet News Telugu

పెనుబల్లిలో షర్మిల దీక్ష: నాగేశ్వరరావు కుటుంబానికి పరామర్శ


ప్రభుత్వ ఉద్యోగాలను  భర్తీ చేయాలనే డిమాండ్ తో  వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు ఇవాళ ఖమ్మంలో దీక్షకు దిగారు. ప్రతి మంగళవారం నాడు షర్మిల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించాలనే డిమాండ్ తో  నిరసనకు దిగిన విషయం తెలిసిందే. 

YS Sharmila stages protest for recruitment government jobs in Khammam lns
Author
Khammam, First Published Jul 20, 2021, 2:10 PM IST

ఖమ్మం: ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్ చేస్తూ  వైఎస్‌ఆర్‌టీపీ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు దీక్షకు దిగారు.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకొన్న నిరుద్యోగి నాగేశ్వరావు కుటుంబాన్ని వైఎస్ షర్మిల మంగళవారం నాడు పరామర్శించారు. నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

నాగేశ్వరరావు కుటుంబ పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకొన్నారు. నాగేశ్వరరావు కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉటామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం ఆమె గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత దీక్షకు దిగారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్ తో ప్రతి మంగళవారం నాడు నాడు వైఎస్ షర్మిల దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నెల 8వ తేదీన తెలంగాణలో ఆమె పార్టీని ప్రారంభించారు. పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ  నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఆమె ప్రకటించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం తాను పార్టీని ఏర్పాటు చేశానని ఆమె చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios