Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై షర్మిల డెడ్‌లైన్.. లేకుంటే సొంతంగానే బరిలోకి..!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల తన పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం దిశగా అడుగులు వేస్తున్న సంగతి  తెలిసిందే. అయితే తాజాగా వైఎస్ షర్మిల.. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై డెడ్‌లైన్ ప్రకటించారు.

YS Sharmila Sensational statement about YSRTP merger in Congress News ksm
Author
First Published Sep 25, 2023, 4:50 PM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల తన పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం దిశగా అడుగులు వేస్తున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలిసి చర్చలు జరిపారు. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తాజాగా వైఎస్ షర్మిల.. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై డెడ్‌లైన్ ప్రకటించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో ఈరోజు పార్టీ రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం, ఎన్నికల వ్యూహం, తదితర అంశాలపై నేతలతో షర్మిల చర్చించారు. 

ఈ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ..కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై ఈనెల 30లోపు నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. ఒకవేళ విలీనం లేకుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా బరిలో దిగుతామని తెలిపారు. విలీనం లేకుంటే 119 నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ సిద్దంగా ఉందని చెప్పారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.  పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios