వైఎస్సార్‌టీపీలో పొంగులేటి చేరికపై వైఎస్ షర్మిల కీలక కామెంట్స్.. ఏం చెప్పారంటే..
వైఎస్సార్ తెలంగాణ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఈరోజు తన పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్న సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా చిట్‌చాట్‌లో షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్‌టీపీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌టీపీలో చేరతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట ఇచ్చారని చెప్పారు.
ఇక, ఇటీవల అధికార బీఆర్ఎస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగిన ఆ దిశగా అడుగులు పడలేదు. ఇటీవల వైఎస్ షర్మిలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఆయన వైఎస్సార్‌టీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి మీడియా చిట్‌చాట్‌లో స్పందించిన వైఎస్ షర్మిల.. పార్టీలో చేరతారని పొంగులేటి మాట ఇచ్చారని అన్నారు.
ఇక, వరంగల్ జిల్లా శంకరమ్మ తండాలో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు షర్మిల పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ రాత్రికి నెక్కొండలో ఆమె బస చేయనున్నారు.