సెల్ ఫోన్ విషయంలో చోటు చేసుకున్న గొడవ ఓ స్నేహితుడి ప్రాణాలు తీసింది. క్షణికావేశంలో ఇద్దరు హంతకులుగా మారారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
పెద్దేముల్ : ముగ్గురు మిత్రుల మధ్య cell phone చిచ్చు రేపింది. క్షణికావేశంలో ఇద్దరు కలిసి మరో friendని murder చేశారు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గుంటపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం midnight జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణంలోని Gandhinagar కు చెందిన ప్రశాంత్ (16), అతని ఇద్దరు స్నేహితులు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ప్రశాంత్ ఇటీవల ఒక cell phone ను తన మిత్రులకు ఇచ్చి అమ్మిపెట్టమని చెప్పాడు.
వారిద్దరూ ఓ దుకాణానికి వెళ్లగా.. దొంగతనం చేసి తీసుకువచ్చారా.. అని యజమాని ప్రశ్నించడంతో భయపడి వెనక్కి వచ్చేశారు. తర్వాత ప్రశాంతిని మిగతా ఇద్దరూ నిలదీశారు. తమను దొంగలుగా చిత్రీకరించేందుకు ఇలా చేశాడని అనుమానించి కక్ష పెంచుకున్నారు. బుధవారం సాయంత్రం ఇదే విషయంపై మాట్లాడదామని ఫోన్ చేసి ప్రశాంతిని పిలిపించారు. ముగ్గురూ కలిసి అంతారం తండాకు వెళ్లి కొద్దిసేపు గొడవ పడ్డారు. స్థానికులు గమనిస్తూ ఉండడంతో అక్కడి నుంచి అటవీ ప్రాంతానికి వెళ్లి ఘర్షణపడ్డారు.
ప్రశాంత్ ని మిగతా ఇద్దరూ కలిసి కిందపడేసి బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే రోజు రాత్రి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. బాధితుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు డిసెంబర్ లో సెల్‌ఫోన్ ఇవ్వలేదని స్నేహితుడిని కొట్టి చంపేసిన అమానుష ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. పనికోసం ఎక్కడి నుంచో హైదరాబాద్ వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య సెల్‌ఫోన్ గొడప పెట్టింది. ఇద్దరు తీవ్రంగా కొట్టుకున్నారు. తీవ్ర ఆవేశానికి లోనైన ఒకరు.. తన స్నేహితున్ని ప్రాణాలు తీశాడు. ఈ ఘటన ఆసిఫ్ నగర్ లో చోటుచేసుకుంది. సెల్ ఫోన్ కోసం గొడవపడి స్నేహితున్ని చంపిన ఘటన గురించి ఆసిఫ్ నగర్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 సంత్సరాల జితేందర్ ఉపాధి కోసం ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు. అతను ఆసిఫ్ నగర్ ఏరియా జిర్రాలోని వర్క్‌షాపులో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. పనిచేసుకుంటూ వర్క్‌షాపులోనే ఉండేవాడు. ఇదిలావుండగా, ఇటీవల అతని స్నేహితుడు ఫరూఖ్ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చాడు. తన స్నేహితుడైన జితేందర్ వద్దకు వచ్చి.. అతనితో కలసి వర్క్‌షాపులోనే ఉంటున్నాడు. అయితే, ఆదివారం ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. అనూహ్యంగా జితేందర్ వర్క్‌షాప్‌లో శవమై కనిపించాడు. ఉత్తరప్రదేశ్ నుంచి ఇటీవలే వచ్చిన ఫరూక్ సైతం తీవ్రగాయలతో అక్కడే పడి ఉన్నాడు. ఉదయం వర్క్ షాప్ వద్దకు రాగానే యజమానికి ఈ భయానక దృశ్యాలు కనిపించాయి.
ఈ ఘటనపై వెంటనే వర్క్ షాప్ యజమాని ముంతాజిర్ పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. అంతకు ముందు రోజు జరిగిన విషయాలను పైనా యజమానికి అడిగి తెలుసుకున్నారు. మొత్తం దర్యాప్తులో ఈ ఇద్దరు స్నేహితుల మద్య సెల్ ఫోన్ కారణంగా చోటుచేసుకున్న గొడవతోనే ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి ముందు రోజు రాత్రి ఇద్దరు స్నేహితుల మధ్య సెల్‌ఫోన్ విషయమై గొడవ జరిగినట్లు ఆసిఫ్ నగర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే వీరిద్దరు గొడవపడ్డారనీ, ఆవేశానికి లోనై ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరిందని పేర్కొన్నారు.
