భార్య తీరుతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి కాకతీయ కెనాల్ లోకి దూకాడు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగు నూర్ కాకతీయ కాలువలో సోమవారం ఈ ఘటన జరిగింది.

"

అతన్ని గమనించిన స్థానిక మత్స్య కారులు వెంటనే కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది. తన భార్య చాలా తెలివిగల్లదని, మోసం చేస్తుందన్న అనుమానంతో చచ్చిపోదామనుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇతన్ని ఆదిలాబాద్ కు చెందిన వెంకటేష్ గా గుర్తించారు. ఇతన్ని బాలరాజు అనే మత్స్యకారుడు కాపాడాడు. 

అయితే ఈ కాలువ దగ్గర ఈ ఘటనలు ఇప్పుడు కొత్తకాదని మత్స్య కారులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం కరీంనగర్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు పిండ ప్రదానం కోసం కాకతీయ కాలువ వద్దకు వచ్చి పిండ ప్రదానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయారు. ఆ సమయంలో  అక్కడే ఉన్న మత్స్యకారులు రాజు, కుమార్ లు వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు.  

అయితే చాలా మంది ఇక్కడకు వచ్చి ఆత్మ హత్య యత్నం కి పాల్పడు తున్నా రని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. అంతేకాక పలువురు ప్రమాదవశాత్తు కాలువలో జారి తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అంటు న్నారు. కాలువలో దూకిన వారిని  గతంలో  కాపాడితే ఎల్ ఎండీ పోలీసులు ఘనంగా సత్కరించి షీల్డ్ లను అందజేసి గౌరవించారనీ గుర్తు చేశారు. కాలువ వద్ద ఒక పోలీస్ నిరంతరం పహారా కాస్తే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని వాహనదారులు సూచిస్తున్నారు.