హైదరాబాద్: హైద్రాబాద్ నెక్లెస్ రోడ్డులో  కారులోనే ప్రేమ జంట అసభ్య ప్రవర్తనపై అభ్యంతరం తెలిపిన ముగ్గురు యువకులపై ప్రేమ జంట దాడికి పాల్పడంది. ఈ దాడిలో ఓ యువకుడు  తీవ్రంగా గాయపడ్డాడు.

హైద్రాబాద్‌ నెక్లెస్ రోడ్డులో  ముగ్గురు యువకులు తమ బర్త్‌డే వేడుకలు చేసుకొనేందుకు గురువారం తెల్లవారుజామున  వచ్చారు. అదే సమయంలో  రోడ్డు పక్కనే కారులో ఉన్న ప్రేమ జంట అసభ్యంగా ప్రవర్తించింది.

ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు యువకులు ప్రేమ జంట తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రేమ జంట ముగ్గురు యువకులపై దాడికి దిగారు. ప్రియుడు రాయితో  ముగ్గురు యువకులపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘర్షణను అప్పుడే అటు వైపుగా వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన యువకులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరో వైపు దాడికి పాల్పడిన ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.