హైదరాబాద్: నగరంలోని జవహర్ నగర్ లో ఓ యువకుడు గన్ తో అన్నా చెల్లెళ్లను బెదిరించాడు. శుక్రవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది. గన్ తో ఎందుకు బెదిరించాడనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కీసరలోని ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్ధులుగా పోలీసులు గుర్తించారు. అన్నా చెల్లెళ్లను  యువకుడు గన్ తో బెదిరించాడు. గన్ తో బెదిరించిన యువకుడిని అభిషేక్ గా పోలీసులు గుర్తించారు.ఈ విషయమై పోలీసులకు అందిన సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నారు. అన్నా చెల్లెళ్లను ఎందుకు యువకుడు ఎందుకు బెదిరించాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆ యువకుడికి గన్ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

గతంలో కూడ రాష్ట్రంలో గన్ తో బెదిరింపులకు పాల్పడిన ఘటనలు కూడ చోటు చేసుకొన్నాయి. పెళ్లి సందర్భంగా నిర్వహించే  బరాత్ వేడుకల్లో తుపాకులు, కత్తులతో ప్రదర్శనలు  నిర్వహించిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.

గన్ తో బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు కూడ ఉన్నాయి.