స్నేహితుడు హోమో సెక్స్‌కు సహకరించలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్‌ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌(22) మై మదర్‌ హోమ్‌ కేర్‌ సర్వీసెస్‌లో కేర్‌ టేకర్‌గా పనిచేస్తున్నాడు. నిస్సహాయులైన వారికి కేర్‌ టేకర్‌గా పనిచేస్తున్నాడు. 

హైదరాబాద్: స్నేహితుడు హోమో సెక్స్‌కు సహకరించలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్‌ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌(22) మై మదర్‌ హోమ్‌ కేర్‌ సర్వీసెస్‌లో కేర్‌ టేకర్‌గా పనిచేస్తున్నాడు. నిస్సహాయులైన వారికి కేర్‌ టేకర్‌గా పనిచేస్తున్నాడు. ఓల్డ్‌మలక్‌పేటలో వృద్ధుడైన ముర్తుజా హుస్సేన్‌ ఇంట్లో పనిచేసేందుకు వచ్చాడు. 

ప్రవీణ్‌, శివాజీ అలియాస్‌ చిట్టి స్నేహితులు. ఇద్దరు కలిసి ఓల్డ్‌మలక్‌పేటలోని ఇంట్లో గదిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. ప్రవీణ్‌ శివాజీతో హోమో సెక్స్‌కు సహకరించాలని పలుమార్లు ఒత్తిడితెచ్చాడు. 

ప్రవీణ్ ప్రవర్తనతో విసుగెత్తిన శివాజీ అతనితో మాట్లాడడం మానేశాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్‌ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.