అమీర్ పేటలో దారుణం చోటుచేసుకుంది. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై ఓ యువకుడు అత్యంత కిరాతకంగా కత్తితో దాడిచేశాడు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఈ దాడికి పాల్పడ్డాడు. జాతీయ రహదారిపై తీవ్రమైన రద్దీ సమయంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. 

ఇంతియాజ్ అనే యువకుడిని టార్గెట్ గా చేసుకుని  ఓ గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. వాహనంలో నుండి బాధితున్ని బయటకులాగి రోడ్డుపై పడేసిన దుండగుడు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. శరీరంపై ఎక్కడపడితే అక్కడ పొడుస్తూ  హంగామా సృష్టించాడు. కొందరు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వారిని తప్పించుకుని మరీ యువకుడు దాడికి పాల్పడ్డాడు. 

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో కొన ఊపిరితో చికిత్స పొందుతున్నట్లు తెలస్తోంది. అతడికి ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నామని... మరికొంత సమయం గడిస్తే గాని ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.

ఈ హత్యాయత్నాన్ని కొందరు వాహనదారులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. వారు దాన్ని అందరికీ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతోంది. 

వీడియో

"