చంద్రబాబు అనే దోపిడీదారుడికి కొమ్ముకాసిన చరిత్రహీనుడు పవన్ అని సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు. పవన్‌ రాజకీయ సినిమాకు లింగమనేని రమేష్‌ నిర్మాత, చంద్రబాబు దర్శకుడని ఆరోపించారు. పవన్‌ పార్టనర్ చంద్రబాబు రాజకీయ వ్యభిచారి‌ అని అన్నారు.

విజయవాడ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను చీడపురుగుగా అభివర్ణించారు. జనసేనను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతకు అమ్మారో పవన్‌ చెప్పాలని ఆయన అడిగారు. 

చంద్రబాబు అనే దోపిడీదారుడికి కొమ్ముకాసిన చరిత్రహీనుడు పవన్ అని సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు. పవన్‌ రాజకీయ సినిమాకు లింగమనేని రమేష్‌ నిర్మాత, చంద్రబాబు దర్శకుడని ఆరోపించారు. పవన్‌ పార్టనర్ చంద్రబాబు రాజకీయ వ్యభిచారి‌ అని అన్నారు.

చంద్రబాబుకు అమ్ముడుపోయిన క్యారెక్టర్‌ లెస్‌ ఫెలో పవన్‌ అని జనం చెప్పుకుంటున్నారని, అసెంబ్లీకి ఎందుకు వెళ్లరని ప్రశ్నిస్తున్న పవన్‌ కల్యాణ్ వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటుంటే.. చంద్రబాబును ఎందుకు అడ్డుకోలేదని అన్నారు. 

నీతి, నియమం, కుటుంబం, వివాహం, రాజకీయం, సమాజం అనే వ్యవస్థలకు పట్టిన చీడపురుగు పవన్ అని వ్యాఖ్యానించారు. జగన్‌కు కులాలను అంటగడతావా అని అడిగారు. సినీ వ్యామోహంతో మీ వెంట వెంపర్లాడే యువకులను, కులదారుల్లోకి తీసుకెళ్తావా అని ప్రశ్నించారు.