రెజ్లర్లను అవమానించారు.. కేంద్రం తీరుపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్

Hyderabad: భార‌త రెజ్ల‌ర్ల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వ‌ర్తిస్తున్న తీరుపై భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కుడు దాసోజు శ్ర‌వ‌ణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమవారం ఖైరతాబాద్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.
 

wrestlers were insulted. BRS leader Dasoju Shravan slams Centre  RMA

BRS senior leader Dr Dasoju Sravan: భార‌త రెజ్ల‌ర్ల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వ‌ర్తిస్తున్న తీరుపై భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కుడు దాసోజు శ్ర‌వ‌ణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమవారం ఖైరతాబాద్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. రెజ్లర్లకు జరిగిన అవమానాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ ఖండించారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. సోమవారం ఖైరతాబాద్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేంద్రం పై విమ‌ర్శ‌లు  గుప్పించారు. 

'పార్లమెంట్ భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్య సభ. ఇది చట్టం చేయడానికి, సమస్యలను లేవనెత్తడానికి నిలయం. అయితే బీజేపీ ఎంపీ లైంగిక వేధింపుల అంశాన్ని లేవనెత్తేందుకు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా మహిళా రెజ్లర్లు నిరసన తెలపగా వారిని దారుణంగా అవమానించారు. ఒలింపిక్స్ గెలిచిన మహిళా రెజ్లర్ల పట్ల ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇదేనా? అది కూడా కొత్త పార్లమెంట్ ప్రారంభమవుతున్న రోజేనా? అని శ్రవణ్ ప్రశ్నించారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ పట్టాభిషేకంలా కనిపిస్తోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

"కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం భారత ప్రజాస్వామ్యంలో ఒక కీలక సంస్థ ప్రారంభోత్సవం కంటే నరేంద్ర మోడీ పట్టాభిషేకంలా కనిపించింది. ప్రజాస్వామ్య ఆచారాలు, సంప్రదాయాలను పక్కన పెట్టి పార్లమెంట్ ప్రారంభోత్సవంలో నరేంద్ర మోడీ చక్రవర్తిలా వ్యవహరించారు. ఇది ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్య సూత్రాలను కించపరిచే చర్య" అని అన్నారు. నిరంకుశ, అప్రజాస్వామిక మోడీ ప్రభుత్వానికి త్వరలోనే శుభంకార్డు ప‌డుతుంద‌నీ, బీజేపీ, కాంగ్రెస్ ల కుటిల వ్యూహాల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దాసోజు శ్రవణ్ అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios