రూ.40కోట్లు విలువచేసే వెండిని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. బోయిన్ పల్లిలో భారీగా తరలిస్తున్న వెండిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి డెయిరీ ఫాం రోడ్డులో పోలీసుల తనిఖీలు జరుపుతుండగా రెండు కంటెయినర్లలో పది టన్నుల వెండి కడ్డీలు పట్టుబడ్డాయి. 

వీటి విలువ సుమారు రూ.40 కోట్లు ఉంటుందని పోలీసుల అంచనా వేస్తున్నారు. తొలుత ఈ వెండి లండన్ నుంచి చెన్నైకు తరలించారని అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.