పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో.. ఓ యువతి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలో  చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం కరీంనగర్ జిల్లాలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో కానిస్టేబుల్ సెలక్షన్స్ ఏర్పాటు చేశారు.

కాగా... వెలిశాల గ్రామానికి చెందిన మమత అనే యువతి కానిస్టేబుల్ సెలక్షన్స్ లో పాల్గొనేందుకు అక్కడికి వచ్చింది. కాగా.. అక్కడ ఏర్పాటు చేసిన పరుగు పందెంలో కూడా ఆమె పాల్గొంది. అయితే పరుగుపందెం ముగిశాక కాసేపటికే గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. అలాగే స్పృహ తప్పిపడిపోయిన మరో ఇద్దరు అభ్యర్థులను ఆస్పత్రికి తరలించారు. ఇరువురిని జగిత్యాలకు చెందిన రశ్మిత, చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మనీషాగా గుర్తించారు.

ఇటీవల కాలంలో ఇలా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణకు వచ్చి గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల హైదరాబాద్ లో ఇద్దరు యువకులు ఇలానే కన్నుమూయడం గమనార్హం.