కరీంనగర్:ప్రేమించి పెళ్లి చేసుకొని తనకు ఇంటికి రానివ్వడం లేదని ఓ మహిళ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడితే మరో వైపు భర్త చనిపోయి నాలుగు నెలలు గడుస్తున్నా తన కూతురికి న్యాయం చేయడం లేదంటూ అత్త మామ ల ఇంటి ముందు మహిళ సంఘాలతో ఆందోళనకు దిగిన సంఘటనలు కరీంనగర్ జిల్లా లో చోటు చేసుకున్నాయి..

కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం శ్రీరాముల పల్లి గ్రామానికి చెందిన చిట్యాల సంధ్య శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సంతోష్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రే గుమించుకుని కులాలు వేరు కావడం తో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో  గత సంవత్సరం ఇళ్లందకుంట పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

 అయితే గత సంవత్సరం లాక్ డౌన్ ఉండడం తో కొన్ని రోజులు పుట్టింట్లోనే ఉన్న సంధ్య కొంతకాలం తర్వాత  భర్తతో కలిసి హైదరాబాద్ కు వెళ్లింది. అక్కడ కొన్ని రోజులు బాగానే ఉన్న అనంతరం భర్త సంతోష్ భార్య సంధ్యను వదిలేసి తన ఇంటికి వచ్చేశాడు.అయితే తన భర్త తనకు కావాలంటూ భర్త సంతోష్ ఇంటి ముందు దర్నాకు దిగింది. ఈ దర్నాతో  సంతోష్ తల్లిదండ్రులతో ఇంటిక తాళం వేసి పారిపోయారు. 

అయితే పోలీసులు సంధ్య కు కౌన్సిలింగ్ చేసి పెద్ద. మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని సూచించారు దీంతో నేడు భర్త భర్త తరుపు వాళ్ళు ఎవరు రాకపోవడం తో మనస్థాపం చెందిన సంధ్య నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిచింది.దీంతో సంధ్య ను జమ్మికుంట ఆసుపత్రికి తరలించిన పోలీసులు. 

మరో వైపు జమ్మికుంట పట్టణానికి చెందిన సాయి చైతన్య ఇదే పట్టణానికి చెందిన మమత గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది.అయితే గత నాలుగు నెలల క్రితం సాయి చైతన్య అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పటి నుండి మమత తన పుట్టింటి వద్దే ఉంటుంది అయితే తన కూతురికి న్యాయం చేయాలని అత్త మామ లను కోరగా వాళ్ళు నిరాకరిస్తున్నారంటు అత్త మామ ల ఇంటి ముందు మహిళ సంఘాలతో ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని భర్త లేనందున భర్త ఆస్తి తన కూతురికి ఇవ్వాలని కోరుతుంది అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.