ఓ వ్యక్తి అనుకోకుండా దారుణంగా హత్యకు గురయ్యాడు. అయితే.. అతనిని సొంత ప్రియురాలే హత్య చేసిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చింతకుంట చెందిన దత్తుకు పదేళ్ల క్రితం రామాయంపేట్‌కు చెందిన దివ్యతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు జన్మించిన తర్వాత మూడేళ్లకే కుటుంబంలో కలహాలు రావడంతో దివ్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన స్వరూపతో దత్తుకు పరిచయం ఏర్పడింది. 

వీరిద్దరు సహజీవనం చేయడంతో కుమారుడు జన్మించాడు. భార్యభర్తలుగా ఉంటున్న వీరి మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చాయి. దీంతో కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం షాపింగ్‌ చేయడానికి మోస్రాకు దత్తు, స్వరూప వెళ్లారు.

అయితే.. తిరిగి ఇంటికి మాత్రం స్వరూప ఒక్కతే వచ్చింది. తర్వాతి రోజు అటవీ ప్రాంతంలో దత్తు మృతదేహం కనపడింది. కాగా.. అతనిని స్వరూప హత్య చూసిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దత్తు హత్యలో సదరు మహిళ ప్రమేయం ఉందా..? మద్యం తాగే అలవాటు ఉన్న దత్తును ఎవరైనా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారా..? అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి ఉంటుందని హతుడి తండ్రి గంగాధర్‌ పీఎస్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.