ఖమ్మం: ఓ వ్యక్తి మృద్ధురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పరిధిలో మంగళవారం ఆ సంఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శ్రీనివాసులు మీడియాకు అందించారు. బజ్యా తండాకు చెందిన వృద్ధురాలు అజ్మీర నాజీ (69)పై కొద్ది రోజులుగా కారేపల్లికి చెందిన అదెర్ల ఉపేందర్ (43) అత్యాచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు.

ఆమె ఆ విషయాన్ని గ్రామస్తులందరికీ చెప్పింది. దాన్ని తట్టుకోలేక ఉపేందర్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు ఈ నెల 26వ తేదీన రాత్రి నాజీని చీమలపాడు రహదారి వైపు బలవంతంగా తీసుకుని వెళ్లాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను నరికి ఆమెను చంపేశాడు. వాటిని అక్కడే కాల్చేశాడు. మొండం భాగాన్ని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం తిర్లాపురం రైల్వే ట్రాక్ మీద పడేశాడు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఉపేందర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు నాజీ భర్త 20 కింద మరణించాడు. ఆమెకు ముగ్గురు కుమారులు. వారు కూలీ పనులు చేసుకుంటున్నారు ఒక కూతురు ఉంది. నాజీ కొంత మతిస్థిమితం కోల్పోయి కుమారుల వద్ద ఉండకుండా కారేపల్లిలో రోడ్ల వెంట రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేది. కుమారులు తండాకు తీసుకుని వెళ్లిన వారిని తిట్టి మళ్లీ కారేపల్లికి వచ్చేది.

వృద్దురాలి మృతిపై పోలీసులు ఆమె కుమారులను కూడా అనుమానిస్తున్నారు. నాజీ కుమారులు తమకు ఫిర్యాదు చేయలేదని, నిందితుడు చెప్పిన వివరాలతో కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. 

కాల్చిన అడవి పందిని బస్తాలో మూట కట్టానని, ఉరీ శివారున పడేసి వద్దామని ఉపేందర్ స్థానిక యువకుడి సాయం తీసుకున్నాడు. స్నేహితుడి టూవీలర్ మీద వెళ్లి ఓ చోట పడేశాడు. అనుమానం వచ్చి ఉపేందర్ స్నేహితుడు బస్తా విప్పి చూశాడు. మనిషిని పోలీనల విధంగా ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ఉపేందర్ ను అదుపులోకి తీసుకున్నారు.