హైదరాబాద్: దుబాయ్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా 2.021 కిలోల బంగారం పట్టుబడింది. ఈ బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

మహిళ వద్ద లభించిన బంగారం బిస్కెట్ల రూపంలోనే కాకుండా నగల రూపంలో వున్నట్లు అధికారులు తెలిపరు. కస్టమ్స్ అధికారుల అదుపులో వున్న నిందితురాలిని విచారిస్తున్నారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.96.04 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.