సెల్ ఫోన్ ఓ యువతి ప్రాణం తీసింది. సెల్ ఫోన్ కోసం యువతి పడిన తాపత్రయం ఆమె ప్రాణాలను మింగేసింది. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  సీతాఫలమండి ప్రాంతానికి చెందిన యువతి బుధవారం ఉదయం ఎంఎంటీఎస్ రైలులో ఆఫీసుకు బయలుదేరింది. కాగా... మార్గమధ్యంలో రైలులో నుంచి పొరపాటున యువతి ఫోన్ జారి కింద పడిపోయింది. ట్రైన్ కదులుతుండగానే ఆ ఫోన్ ని తీసేందుకు యువతి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె కాలు జారి పట్టాలపై పడింది. అదే సమయంలో ట్రైన్ కదులుతుండటంతో ఆమె మీద నుంచి ట్రైన్ పోయింది. దీంతో ఆమె శరీరం రెండు ముక్కలయ్యింది. అక్కడికక్కడే యువతి ప్రాణాలు కోల్పోయింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.