Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్‌ ఆసుపత్రిలో డాక్టర్ శ్వేత అనుమానాస్పద మృతి: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పేరేంట్స్

నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసపత్రిలో డాక్టర్ శ్వేత అనుమానాస్పద స్థితిలో మరణించింది. గుండెపోటుతో మరణించిందా లేదా ఇతరత్రా కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Woman Doctor Swetha Suspicious Death In Nizamabad Governent Hospital
Author
Hyderabad, First Published May 13, 2022, 3:01 PM IST


నిజామాబాద్:జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో పీజీ స్టూడెంట్ డాక్టర్ Swetha అనుమానాస్పద స్థితిలో శుక్రవారం నాడు మరణించింది. గైనకాలజీ వార్డులో విదులు నిర్వహించిన డాక్టర్ శ్వేత రెస్ట్ రూమ్ లోనే Dead  చెందింది. ఉమ్మడి Karimnagar జిల్లాకు చెందిన డాక్టర్ శ్వేత  Nizambad లోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో Medico గా విధులు నిర్వహిస్తుంది.  గైనకాలజీ విభాగంలో పీజీ సెకండియర్ చదువుతుంది  డాక్టర్ శ్వేత. గుండెపోటుతో డాక్టర్ శ్వేత మరణించినట్టుగా వైద్యులు అనుమానిస్తున్నారు. గతంలో రెండుస్లారు శ్వేతకు Covid-19 సోకింది. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత  చోటు చేసుకొన్న ఆరోగ్య మార్పులతో ఆమెకు గుండెపోటు వచ్చిందా అనే కోణంలో కూడా వైద్యులు అనుమానిస్తున్నారు.

శుక్రవారం నాడు  తెల్లవారుజాము  రెండు గంటల వరకు డాక్టర్ శ్వేత గైనకాలజీ విభాగంలో విధులు నిర్వహించింది. మూడు గంటల సమయంలో ఆసుపత్రిలోనే ఉన్న రేస్ట్ రూమ్ లోనే డాక్టర్ శ్వేత వెళ్లి పడుకుంది. ఉదయం తోటి సిబ్బంది చూసే సరికి శ్వేత మృతి చెందింది.

తమతో పాటు కలిసి పనిచేసే తోటి డాక్టర్ హఠాత్తుగా చనిపోయే సరికి తోటి జూనియర్ డాక్టర్లు అంతా విషాదంలో నిండి ఉన్నారు. డ్యూటీలో ఉన్న పీజీ డాక్టర్ శ్వేత గుండెపోటుతో మృతి చెందటం పట్ల నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. డాక్టర్ శ్వేత చాలా చలాకీగా ఉండేవారని చెప్పారు.

ఆమెలో ఎప్పుడూ కూడా డిప్రెషన్ వంటిది చూడలేదన్నారు. ఆమె మరణం చాలా బాధాకరమన్నారు.. డాక్టర్ శ్వేత నైట్ ఫ్రెండ్స్ కు జ్యూస్ పార్టీ కూడా ఇచ్చిందన్నారు.  అంత యాక్టివ్ గా ఉన్న అమ్మాయి అలా చనిపోవటం చాలా బాధగా ఉందని అన్నారు.

డాక్టర్ శ్వేతకు చిన్న యాక్సిడెంట్ అయిందని మీరు వెంటనే రావాలని తమకు సమాచారం వచ్చిందని డాక్టర్ శ్వేత తల్లి ఆరోపించారు. ఆసుపత్రిలో పనిచేసే తన కూతురికి యాక్సిడెంట్ ఎలా అయిందని ఆమె ప్రశ్నించారు. తన కూతురు ఎలా చనిపోయిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాత్రి కూడా తనతో ఆమె మాట్లాడిందన్నారు. మరో వైపు తన కూతురు చాలా యాక్టివ్ గా ఉండేదని తండ్రి చెప్పారు. రాత్రి కూడా తాను డాక్టర్ శ్వేతతో మాట్లాడినట్టుగా ఆయన గుర్తు చేసుకున్నారు.

మరో వైపు డాక్టర్ శ్వేత డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించడానికి పేరేంట్స్ అంగీకరించడం లేదు. జార్ఖండ్ లో పోలీస్ శిక్షణలో ఉన్న డాక్టర్ శ్వేత సోదరుడు వచ్చిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతిస్తామని  డాక్టర్ శ్వేత పేరేంట్స్ చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios