హైదరాబాద్: భర్తపై అనుమానంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని అనుమానించిన ఆమె ఉరేసుకుని మరణించింది.

పశ్చిమ బెంగాల్ కు చెందిన అనూప్‌ ఘరాయి, అపురూప(26) దంపతులకు ఇద్దరు సంతానం. వీరు ఘాన్సిబజార్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు తరచూ గొడవ పడేవారు. అనూప్‌ ఘరాయికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్య తరుచూ గొడవపడేది. 

మంగళవారం రాత్రి కూడా ఇద్దరు గొడవ పడి మధ్యరాత్రి నిద్రపోయారు. ఉదయం 8 గంటలకు భర్త అనూప్‌ ఘరాయి నిద్రలేచి చూడగా అపురూప ఉరేసుకుని కనిపించింది. పై అంతస్తులో ఉండే మృతురాలి సోదరుడు డైబిందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

చార్మినార్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.