ఈ నెల 9వ తేదీన మహిళ ఇంటి నుంచి పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిి రాలేదు. మృతురాలి కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు ఈ నెల 10న నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కౌకూర్ అటవీ ప్రాంతంలో దొరికిన మహిళ మృతదేహం కేసు మిస్టరీ వీడింది. మహిళను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మల్కాజిగిరి డీసీపీ ఈ కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. నేరేడ్ మెట్ పరిధిలోని వినోభానగర్ కు చెందిన చంద్రకళ(43) మృతదేహాన్ని బుధవారం కౌకూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు.
ఈ నెల 9వ తేదీన మహిళ ఇంటి నుంచి పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిి రాలేదు. మృతురాలి కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు ఈ నెల 10న నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన పిక్కలి సురేష్(28) ను అదుపులోకి తీసుకున్నారు.
ఆమె ఒంటి పై బంగారం, వెండి ఆభరణాలను అపహరించడంతోపాటు.. ఆమెను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. చంద్రకళకు పని ఇప్పిస్తానని నమ్మించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
