తన తొమ్మిదేళ్ల కొడుకు చనిపోవడానికి మరదలే కారణమని ఓ వదిన అనుమానించింది. పగతో రగిలిపోయింది. ప్రతీకారం తీర్చుకోవడానికి తొమ్మిదేళ్లు ఆగింది. ఆమె ఏడేళ్ల కొడుకును కిడ్నాప్ చేసి.. హత్య చేసి పగ తీర్చుకుంది. 

నిజామాబాద్ : తన కుమారుడి deathకి మరదలే కారణమని రగిలిపోయిన ఆ మహిళ.. ఆమె కుమారుడిని హతమార్చి Revenge తీర్చుకున్న వైనమిది. nizamabadలో శుక్రవారం సిపి నాగరాజు ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్ లోని ఆటో నగర్కు చెందిన రుక్సానా బేగం, అస్లాం ఖాన్ కుమారుడు ఫైజల్ ఖాన్ 9 ఏళ్ల క్రితం గుంతలో పడి మరణించాడు. అప్పటికి ఆ బాలుడి వయసు మూడేళ్లు. కుమారుడి మృతికి తన భర్త చెల్లెలు సనా బేగమే కారణమని రుక్సానా అనుమానం పెంచుకుంది.

ఈ క్రమంలో మార్చి 31న ఇంటిదగ్గర ఆడుకుంటున్న సనా బేగం కుమారుడు ఫయాజ్(7)ను ఆటోలో బోధన్ కు తీసుకువెళ్లి అక్కడ ఒకరి ఇంట్లో ఉంచి.. తిరిగి ఆటోనగర్ కు చేరుకుంది. అప్పటికే బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెతుకుతుండగా.. తాను వెతుకుతున్నట్లు వారిని నమ్మించింది. అదే రోజు రాత్రి మళ్ళీ బోధన్కు వెళ్ళిన రుక్సానా బేగం ఆ బాలుడిని హతమార్చింది. తరువాత నిజాం సాగర్ కొత్త కెనాల్ నీటిలో పడేసింది.

బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా లోతుగా విచారించిన పోలీసులు బాలుడిని హత్య చేసింది.. తన మేనత్త రుక్సానా బేగం, మరో బాలిక అని తేల్చారు. వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఇదిలా ఉండగా, ఏప్రిల్ మొదట్లో Extra Marital Affair కారణంగా స్నేహితుడిని హత్యచేసి చెరువులో పాతి పెట్టాడు ఓ వ్యక్తి.. ఈ murder కేసు mysteryని పోలీసులు ఏడాది తర్వాత చేదించి.. నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా వి.కోట సీఐప్రసాద్ బాబు కథనం మేరకు పట్టణ పరిధిలోని ముదిమడుకుకు చెందిన షరీఫ్ కుమారుడు ఇస్మాయిల్ (23) ఎలక్ట్రిషన్. ఇతనికి పట్టణంలోని నారాయణ నగర్ కు చెందిన నరేష్ తో స్నేహం ఏర్పడింది. వీరి స్నేహం మొదలైన ఏడాదిన్నర తర్వాత ismail బెంగళూరుకు వెళ్లి బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడే పని చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో నరేష్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో నరేష్ ఇంటి వాళ్ళు గొడవ చేయగా ఆ మహిళతోనే ఉండిపోయాడు. ఈ సమయంలో అప్పుడప్పుడు స్నేహితుడు వద్దకు వచ్చిపోతున్న ఇస్మాయిల్, నరేష్ ప్రియురాలితో సన్నిహితంగా మెలిగేవాడు. నరేష్ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. దీన్ని గమనించిన నరేష్ ఇస్మాయిల్ ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో తన వద్ద అప్పుగా తీసుకున్నడబ్బులు చెల్లించాలని నిరుడు జనవరి 5న ఇస్మాయిల్, నరేష్ ను అని అడిగాడు.

అదే రోజు సాయంత్రం 6 గంటలకు వి.కోటకు వచ్చిన ఇస్మాయిల్ నరేష్ కి ఫోన్ చేశాడు. రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరూ కలిసి మద్యం బాటిల్ తీసుకుని వీకోట చెరువులోకి వెళ్లారు. అక్కడ మహిళ విషయంలో వీరి మధ్య వాదులాట జరిగింది. ఇదే అదనుగా నరేష్ మందు తాగుతున్నట్టు నటించి ఇస్మాయిల్ మందు తాగే సమయంలో మందు బాటిల్ తో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఇస్మాయిల్ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అక్కడే ఇసుక కోసం తీసిన గుంతలో మృతదేహాన్ని వేసి మట్టి కప్పివెళ్ళిపోయాడు.

మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్నేహితులని విచారించడంతో.. నరేష్ సోమవారం తన నేరాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఇస్మాయిల్ ను పాతిపెట్టిన ప్రదేశానికి మండల రెవెన్యూ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. అయితే చెరువులో నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యం కాలేదని సీఐ, తహసిల్దార్ పుల్లారావు తెలిపారు. మొబైల్ ఫోన్ ఆధారంగా హత్యకేసు మిస్టరీని ఛేదించిన పోలీసులకు ఉన్నతాధికారులు అభినందనలు అందుజేశారు.