రాజన్న సిరిసిల్ల జిల్లా,  ఇల్లంతకుంట మండలంలో గత కొద్ది రోజులుగా క్రూర మృగాల బెడద పెరిగిపోయింది. వారం రోజులుగా చిరుత దాడి చేస్తోంది. ఈ దాడిలో మూడు లేగ దూడలు మృత్యువాత పడ్డాయి. 

"

ఈ నేపథ్యంలో గత రాత్రి వల్లంపట్లలో ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి అనే రైతు వ్యవసాయ బావిలో ఓ క్రూరమృగం పడింది. ఇది నక్కజాతికి చెందిందని, హైనా అని మర్నాగని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. 

అయితే జూ అధికారులు, ప్రభుత్వ అధికారులు వస్తే కానీ అసలు ఆ క్రూరమృగం ఏంటనేది స్పష్టంగా తెలియదు. అయితే తమ పెంపుడు జంతువుల్ని తింటున్న పడ్డ మరో క్రూర మృగం ఈరోజు వ్యవసాయ బావిలో ఇలా చిక్కడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.