Asianet News TeluguAsianet News Telugu

కవిత తప్పు చేసిందని కేసీఆర్ నమ్ముతున్నారా !? 

KCR - Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ జరిగి దాదాపు నెల రోజులు దాటింది. ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. కానీ ఇంత వరకు కవితన ఆమె తండ్రి కేసీఆర్ ఒక్క సారి కూడా కలవలేదు. దానికి కారణం ఏంటి ? 

Why is KCR silent on daughter Kavitha arrest KRJ
Author
First Published Apr 16, 2024, 9:55 PM IST

KCR - Kavitha: కన్న కూతురుకు ఆపద వస్తే  ఏ తండ్రైనా తల్లడిల్లిపోతాడు. ఏమైనా చేసి తన బిడ్డను రక్షించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. ఆ విషయంపై ఇప్పటి వరకూ స్పందించలేదు. ఢిల్లి లిక్కర్ స్కామ్ కేసులో  బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి దాదాపు నెల దాటింది. కానీ ఇంత వరకు ఆమెను చూసేందుకు మాజీ సీఎం కేసీఆర్ మాత్రం వెళ్లలేదు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను మార్చి 15వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అదే రోజు ఢిల్లీకి తీసుకెళ్లి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆమెను ఈడీ కస్టడీకి అప్పగించింది. అయితే బెయిల్ కోసం కవిత తరుఫు లాయర్లు పలుమార్లు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. రిమాండ్ గడువు ముగిసిన వెంటనే ఈడీ మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టడం.. కోర్టు మళ్లీ రిమాండ్ విధించడం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో సీబీఐ కూడా ఆమెను అరెస్ట్ చేయడం వరుసగా జరుగుతున్నారు. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. 

అరెస్ట్ అయిన తరువాత ఆమెను చూసేందుకు అన్న కేటీఆర్, హరీశ్ రావు, తల్లి శోభ, కుమారుడు, భర్త వెళ్లారు. కానీ తండ్రి కేసీఆర్ మాత్రం జైలుకు వెళ్లలేదు. ఒక్కసారి కూడా  పరామర్శించలేదు. అదే స్థానంలో మరొకరు ఉంటే ఎంతో తల్లడిల్లిపోయేవారు. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నించేవారు. కానీ కేసీఆర్ మాత్రం అలా చేయలేదని పలువురు భావిస్తున్నారు.  

అలాగని కూతురు అరెస్టు విషయాన్ని బయట ఎక్కడా ప్రస్తావించడం లేదు. అరెస్ట్ విషయంలో బీజేపీపై విమర్శలు చేయడం లేదు. కవితకు కేసీఆర్ ఒక తండ్రిమాత్రమే కాదు.. రాజకీయ గురువు కూడా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమకారుడు.. రెండు సార్లు తెలంగాణను ఏలిన నాయకుడు. కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి.. సీఎం పీఠం నుంచి దిగిన వెంటనే పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఊపిరి కూడా సలపలేని పరిస్థితి తలెత్తింది.

ఇలాంటి సమయంలోనే ఎన్నికలు రావడం ఆ పార్టీ కీలక నాయకులైన కేటీఆర్, హరీశ్ రావుతో సహా కేసీఆర్ ను కూడా బిజీగా మార్చేశాయి. మళ్లీ బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూతురు కోసం తాపత్రేయపడితే దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని, రాజకీయంగా నష్టం వాటిళ్లుతుందని కేసీఆర్ భావిస్తున్నారు కావచ్చు. 

ఢిల్లి లిక్కర్ స్కామ్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐలు చాలా సీరియస్ గా తీసుకొని, పక్కాగా విచారణ జరుపుతోంది. అందుకే కవితకు కోర్టులో బెయిల్ కూడా దక్కడం లేదు. అందుకే కేసీఆర్ కూడా ఇలాంటి సమయంలో తన కూతురు తప్పు చేయలేదని బలంగా చెప్పలేకపోతున్నారు. అయితే విచారణ సమయంలో కవిత సహకరించడం లేదని, సరైన సమాధానాలు చెప్పడం లేదని ఈడీ, సీబీఐ అధికారులు చెబుతున్నారు. కానీ తాను ఏ తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఇది వరకే కవిత చెప్పారు. మరి ఆమె ఇంత ధీమాగా తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నా.. తండ్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ ప్రజలను మొదళ్లను తొలుస్తున్న ప్రశ్న.. 

Follow Us:
Download App:
  • android
  • ios