హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడ పాత చట్టం ద్వారా ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారని హైకోర్టు 
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మంగళవారం నాడు  హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు గాను  గతంలో 108 రోజుల సమయం కోరిన ప్రభుత్వం ప్రస్తుతం 8 రోజుల్లోనే ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల రిజర్వేషన్లు, ఓటరు జాబితా  ఎలా తయారు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సమయంలో 78 జీవో ద్వారా కొత్త వార్డుల రిజర్వేషన్లు, ఓటరు జాబితాను తయారు చేసినట్టుగా అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు హైకోర్టుకు వివరించారు.

కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చిన సమయంలో పాత చట్టం ఆధారంగా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఆర్డినెన్స్ వివరాలను రెండు రోజుల్లో హైకోర్టు ముందు ఉంచుతామని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు.

దీంతో ఈ కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది కోర్టు ఎల్లుండి కోర్టు ఈ కేసుపై ఏ రకమైన తీర్పును ఇస్తోందో చూడాలి

సంబంధిత వార్తలు

మున్సిపల్ ఎన్నికలకు రెడీ: హైకోర్టుకు తెలిపిన కేసీఆర్ సర్కార్