Asianet News TeluguAsianet News Telugu

మరణ వాంగూల్మం ఎందుకు రికార్డు చేయలేదు: వామనరావు హత్యపై హైకోర్టు

అడ్వకేట్ వామన్ రావు మరణ వాంగూల్మం ఎందుకు రికార్డు చేయలేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.
 

what is the reason for not recording of dying declarations of vamana rao asks Telangana High court lns
Author
Karimnagar, First Published Mar 1, 2021, 2:18 PM IST

పెద్దపల్లి: అడ్వకేట్ వామన్ రావు మరణ వాంగూల్మం ఎందుకు రికార్డు చేయలేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసుపై తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు విచారణ నిర్వహించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 17వ  తేదీన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద నడిరోడ్డుపై అడ్వకేట్ వామన్ రావు దంపతులను  దుండగులు నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేస్తోంది. ఈ హత్య కేసుపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ కేసుపై విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ ను  తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. అడ్వకేట్ జనరల్ డీఎస్ ప్రసాద్ వాదనలను విన్పించారు. తీవ్ర గాయాలు ఉన్న కారణంగా వామన్ రావు నుండి మరణ వాంగూల్మం రికార్డు చేయడం సాధ్యం కాలేదన్నారు.

సాక్షుల విచారణ కొనసాగుతోందని ఏజీ తెలిపారు. బస్సులోని సాక్షులను గుర్తించినట్టుగా ఆయన హైకోర్టుకు వివరించారు. ఈ హత్య జరిగిన సమయంలో ఆ రోడ్డు వెంట వెళ్తున్న వారిని కూడ గుర్తించామన్నారు.  ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్ ను మంథని కోర్టులో రికార్డు చేస్తున్నామని ఏజీ ఉన్నత న్యాయానికి వివరించారు.బస్సు డ్రైవర్, కండక్టర్లను కూడా సాక్షులుగా చేర్చామన్నారు. ఈ కేసుపై విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios