Asianet News TeluguAsianet News Telugu

కారణమిదే: నలుగురు మంత్రుల ఓటమి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగినా... నలుగురు మంత్రులు  ఓటమి పాలయ్యారు

what is the reason for four ministers defeated
Author
Hyderabad, First Published Dec 11, 2018, 3:05 PM IST


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగినా... నలుగురు మంత్రులు  ఓటమి పాలయ్యారు. వ్యక్తిగత కారణాలతో పాటు స్థానికంగా ఉన్న నెలకొన్న పరిస్థితులు ఈ నలుగురు మంత్రులఓటమికి  కారణమని  టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌ అభ్యర్థుల వైపు ఓటర్లు తీర్పు ఇచ్చారు. కానీ నలుగురు మంత్రులకు వ్యతిరేకంగా  తీర్పిచ్చారు. పాలేరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థిగా  విజయం సాధించిన తుమ్మల నాగేశ్వర్ రావు ఈ ఎన్నికల్లో అదే స్థానం నుండి  పోటీచేసిన  తుమ్మల నాగేశ్వర్ రావు విజయం సాధించారు. కానీ, ఈ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్ రావు మరోసారి పోటీ చేసి కూడ ఓటమి పాలయ్యారు. 

తాండూరులో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందే  టీఆర్ఎస్ నుండి  కాంగ్రెస్ పార్టీలో చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి  చేరారు. తాండూరులో కాంగ్రెస్  పార్టీ  అభ్యర్థిగా పైలెట్ రోహిత్ రెడ్డి విజయంలో  విశ్వేశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

కొల్లాపూర్‌లో మంత్రి  జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు.1999 నుండి ఈ స్థానం నుండి కొల్లాపూర్ నుండి  విజయం సాధిస్తూ వస్తోన్న జూపల్లి కృష్ణారావు ఈ దఫా ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో తన ఓటమికి తమ పార్టీ కార్యకర్తలే కారణమని  జూపల్లి కృష్ణారావు చెప్పారు.

ములుగులో  మంత్రి చందూలాల్  ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుండి  కాంగ్రెస్  పార్టీ  అభ్యర్థి సీతక్క విజయం సాధించారు. గత ఎన్నికల్లో  చందూలాల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా సీతక్క పోటీ చేశారు.  గత ఏడాది రేవంత్ రెడ్డితో పాటు సీతక్క టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ విజయం సాధించినా.. స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగానే  మంత్రులు ఓటమి పాలయ్యారని  ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios