Asianet News TeluguAsianet News Telugu

వలస కార్మికులకు ఫంక్షన్ హాల్స్‌లో బస : ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

వలస కూలీల కోసం ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకొందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.వలస కార్మికుల సమస్యలపై తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ వసుధ నాగరాజు  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

what did for migrant workers high court asks to telangana government
Author
Hyderabad, First Published May 22, 2020, 5:29 PM IST

హైదరాబాద్: వలస కూలీల కోసం ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకొందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.వలస కార్మికుల సమస్యలపై తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ వసుధ నాగరాజు  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

వలస కార్మికులను ఆదిలాబాద్ సరిహద్దు దాటించి  వదిలేస్తున్నారని పిటిషనర్ చెప్పారు. మేడ్చల్ రహదారిపై వందలాది మంది కూలీలు రోడ్డుపై నడుచుకొంటూ వెళ్తున్నారని ఆయన హైకోర్టు  దృష్టికి తీసుకొచ్చారు.

what did for migrant workers high court asks to telangana government

వలస కూలీలను సరిహద్దులు దాటించి చేతులు దులుపుకోవద్దని  హైకోర్టు సూచించింది. వలస కూలీలను ఆదుకొనేందుకు ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి ఈ నెల 29వ  తేదీ లోపుగా చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

also read:తెలంగాణలో కరోనాతో కానిస్టేబుల్ మృతి: పోలీస్ శాఖలో కోవిడ్‌తో తొలి మరణం

వలస కూలీలను  గుర్తించి ఫంక్షన్లలో ఉంచి వారికి భోజన వసతి కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. కార్మికులు రైళ్లు ఎక్కే వరకు ప్రభుత్వమే భోజనం పెట్టాలని కోరింది.  వలస కార్మికులకు అవసరమయ్యే వైద్య సేవలను కూడ కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు తమ రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. వలస కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుతో శ్రామిక రైళ్లు నడుస్తున్నాయి. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలోని హైద్రాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి శ్రామిక్ రైలు బయలుదేరింది. కంది ఐఐటీ సెంటర్ లో భవన నిర్మాణ కార్మికులుగా పనికి వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన 1500 కార్మికులను పంపిన విషయం తెలిసిందే.

 

Follow Us:
Download App:
  • android
  • ios