Weather update: మండే ఎండల్లో చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ..

Weather update: వేసవికాలం ప్రారంభంలోనే సూర్యుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండలు, ఉక్కపోత, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. ఒకేసారి పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజానీకానికి వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది.

Weather update: IMD predicts rainfall across central, northwest, and north India KRJ

Weather update: తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలోనే భనుడి భగభగమంటూ చెమటలు కక్కిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండలు, ఉక్కపోత, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. ఒకేసారి పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ ప్రజానీకానికి వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రానున్న ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఐదు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరి కొద్ది రోజుల్లోనే వడగాలుల నుంచి ఊరట లభిస్తుందని స్పష్టం చేసింది.

మధ్య మహారాష్ట్ర కేంద్రీకృతమైన ఆవర్తనం కారణంగా మరో మూడు నాలుగు రోజుల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు  వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలోని మంచిర్యాల, నిర్మల్ , నిజామాబాద్, ఆదిలాబాద్ ,ఆసిఫాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో కిందిస్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశలకు వీస్తాయని తెలిపింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది.  

అదే సమయంలో మధ్య ప్రదేశ్‌లో వడగండ్ల వాన కురిసే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా బిహార్‌ రాష్ట్రాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే ఈ సీజన్ ఆరంభంలో వర్షాలు బాగా కురుస్తున్నాయని, మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్లో సరిపడా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

జులై ,ఆగస్టు నెలలో బీహార్, ఝార్ఖండ్, బెంగాల్ సహా తూర్పు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. సీజన్ మొదట్లో ఈశాన్య భారత్ లో సాధారణంగా తక్కువ వర్షాలు పడుతాయని వెల్లడించింది. కేరళ, కర్ణాటక, గోవాలల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios