హైదరాబాద్: ఇవాళ, రేపు(మంగళ, బుధవారాల్లో) తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న(సోమవారం) మాదిరిగినే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

ప్రతిసారి దోబూచులాడే రుతుపవనాలు ఈసారి అనుకున్న సమయానికి కేరళను తాకాయి. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగానే రుతుపవనాల్లో త్వరితమైన కదలికలు ఏర్పడి కేరళను తాకేలా చేశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవి తెలుగురాష్ట్రాల్లోనూ విస్తరించాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో రైతులు పంటలు వేసుకుంటున్నారు.