హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు చాలా చోట్ల, రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల వర్షాలు  కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కోమరంభీం, నిర్మల్ మరియు మంచిర్యాల జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని... ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

read more    కొత్త పట్టాదారులకు వచ్చే ఏడాదిలోనే నిధులు: రైతు బంధు మార్గదర్శకాలివే

పశ్చిమ మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్ లో చాలా  ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్ లో మరికొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించారు. తూర్పు విదర్భ మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా జూన్ 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.