సూర్యాపేట: సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. 

నిరంతరంగా విద్యుత్ ను సరఫరా చేయడంలో తన కృషి ఉందన్నారు. సూర్యాపేట రైతాంగానికి వచ్చే ఏడాది నుండి కనీసం 8 నెలలు గోదావరి నీటిని సరఫరా చేయనున్నట్టు చెప్పారు.

"

పెన్ పహాడ్ మండలం చివరి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీరందించనున్నట్టు ఆయన ప్రకటించారు..ఎస్సారెస్సీ కాలువలను తవ్వి వదిలేసిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదేనని ఆయన విమర్శించారు.