తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతి నియోజకవర్గం నుంచి ఏదైన ఒక పోలింగ్‌ కేంద్రం వీవీప్యాట్ లోని స్లిప్పులను కూడా అధికారులు లెక్కించనున్నారు...ఆ కేంద్రంలోని ఈవీఎంలో నమోదైన ఓట్లతో ఈ స్లిప్పులను సరిపోలుస్తారు. అతి తక్కువ ఆధిక్యాలు వచ్చిన నియోజకవర్గాల్లో మాత్రమే, అదీ అవసరం అనుకుంటేనే అన్ని వీవీప్యాట్లలలోని స్లిప్‌లు లెక్కిస్తారని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ఈ అసెంబ్లీలో 164 కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.