హైదరాబాద్‌ ఔటర్ రింగు రోడ్డుపై వోల్వో బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ బయలుదేరిన బస్సు పెద్ద గోల్కోండ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది.  

బస్సులో మంటలను గమనించి కిందకు దూకేసిన బస్సు డ్రైవర్ ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే షార్ట్ సర్య్కూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి వుండొచ్చని అనుమానిస్తున్నారు.