హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్న కూతురు రేగులపాటి రమ్యారావు త్వరలో బిజెపిలో చేరనున్నారు. ఆమె గతంలో తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధిగా కూడా వ్య వహరించారు. ఆమె బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తోనూ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ కె. లక్షణ్ తోనూ భేటీ అయ్యారు. 

ఇదిలావుంటే, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు జి.వివేక్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో భేటీ అయ్యారు. రాంమాధవ్‌ హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా బుధవారం ఈ సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. 

తెలంగాణలో బలాన్ని పుంజుకోవాలని బిజెపి ఆలోచిస్తోంది. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఇరువురు బిజెపి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.