నూతన సంవత్సర వేడుకల్లో స్వల్ప ఉద్రికత్త చోటు చేసుకుంది. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు సరిగా లేవని ఆగ్రహించిన కొందరు యువకులు వేదికను తగులపెట్టారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మాదాపూర్ సిద్ది వినాయకనగర్‌లోని ఓ క్రికెట్ గ్రౌండ్‌లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.

ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కొందరు తమకు మద్యం సరిగా సరఫరా చేయడం లేదని, డీజే కూడా బాలేదంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి, వారితో వాగ్వాదానికి దిగారు. ఆవరణలో ఉన్న టేబుళ్లు, కుర్చీలు ఎత్తి పారేశారు. మద్యం సీసాలను వేదికపైకి విసిరి నిప్పు పెట్టారు.
దీంతో భయాందోళనలకు గురై అక్కడి నుంచి పరిగెత్తారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అనంతరం అక్కడున్న యువకులను చెదరగొట్టి గ్రౌండ్ నుంచి బయటకి పంపించేశారు.